- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదు.. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్తో ముందుకు వెళ్లాలి
సమాజంలోని నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం ఎవరికి సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్తో ముందుకు వెళ్లాలని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి అన్నారు.

దిశ, తలకొండపల్లి : సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి సూచించారు. మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన యూనియన్ బ్యాంక్ శాఖను నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి తదితరులు సోమవారం ప్రారంభించారు. అనంతరం స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, గ్రామానికి బ్యాంకు మంజూరు కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కృషి చేశారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయడం శుభపరిణామమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గట్టు ఇప్పలపల్లి గ్రామ ప్రజల ప్రధాన కోరికలలో బ్యాంకు ఏర్పాటు ఒకటని, అది నెరవేరడం సంతోషకరమన్నారు. ప్రత్యేక మండల ఏర్పాటుకు పరిసర గ్రామాలన్నీ కలిసి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1,400 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే రహదారుల అభివృద్ధి కోసం మంత్రి సీతక్కను కోరగా రూ.96 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ, బ్యాంకు ఏర్పాటు ప్రజల విజయమని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణలో మాజీ ప్రధాని ఇందిరాగాంధి పాత్రను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, డీజీఎం అపర్ణ రెడ్డి, ఏజీఎం లేపాక్షి జగదీష్, మేనేజర్ రవి, ఏఎంసీ చైర్‌పర్సన్ యాట గీతా నరసింహ, పీఏసీఎస్ చైర్‌పర్సన్ కేశవరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






