మ‌న‌సు ప‌డ్డ‌ మహిళ ద‌క్క‌ద‌న్న భ‌యంతో యువకుని ఆత్మహత్య

by velandi.Saikiran |   (  Updated:2026-06-22 16:27:28  IST  )

తాను మనసు పడిన మహిళ, ద‌క్క‌ద‌న్న ఆవేదనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూత్పూర్ మండలం పాత కప్పెట గ్రామంలో సోమవారం జరిగింది.

మ‌న‌సు ప‌డ్డ‌ మహిళ ద‌క్క‌ద‌న్న భ‌యంతో యువకుని ఆత్మహత్య
X

దిశ, భూత్పూర్ : తాను మనసు పడిన మహిళ, ద‌క్క‌ద‌న్న ఆవేదనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూత్పూర్ మండలం పాత కప్పెట గ్రామంలో సోమవారం జరిగింది. భూత్పూర్ ఎస్సై నాగన్న తెలిపిన వివరాల ప్రకారము...పాత కప్పేట గ్రామానికి చెందిన దేవరకొండ ఆంజనేయులు (25) అనే యువ‌కుడికి ఇంకా పెళ్లి కాలేదు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం జమ్మిస్తాపూర్ గ్రామానికి చెందిన సమీప బంధువుతో (వివాహిత) పరిచయం పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న భ‌ర్త‌ను కాద‌ని, ఆంజ‌నేయులుతో ఏకాంత ప్ర‌దేశానికి ఆ వివాహిత వెళ్లింది. ఆ లేడీ ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఈ త‌రుణంలోనే ఆంజ‌నేయులుతో వెళ్లిన సంఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు ఆ వివాహిత కుటుంబ స‌భ్యులు. ఈ క్ర‌మంలోనే ఆ మహిళను తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి ఆమెను భర్త వద్దకు పంపారు. దీంతో ఆ వివాహిత తిరిగి రాదన్న ఆవేదనతో ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు.

Next Story