- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టపల్లి ఎన్సీఎల్ కాలనీలో భారీ చోరీలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి సింహపురి ఎన్సీఎల్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీలు చోటుచేసుకున్నాయి.

దిశ, మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి సింహపురి ఎన్సీఎల్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీలు చోటుచేసుకున్నాయి. ఎన్సీఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల అపార్ట్‌మెంట్‌లను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఏడు ఫ్లాట్లలోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సమీపంలోని ఎన్సీఎల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు నివసిస్తున్న కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఏడు ఫ్లాట్ల తాళాలు, బీరువాల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు.
ఇళ్లలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును కూడా అపహరించి పరారైనట్లు సమాచారం. ఈ ఘటన పై ఫ్యాక్టరీ ఉద్యోగి మోదాల గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మఠంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ చరమంద రాజు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డాగ్ స్క్వాడ్ సహాయంతో పలు గంటల పాటు ఆధారాలను సేకరించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై మఠంపల్లి ఎస్‌ఐ బి.ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నిందితుల ఆచూకీ కోసం విస్తృతంగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు విలువ పై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.






