- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్: కూన శ్రీశైలం గౌడ్
సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేస్తే ఎమ్మెల్యే వివేకానందను కుత్బుల్లాపూర్‌లో తిరగనివ్వం.. ఆయన చాటుమాటున సీఎం కాళ్లు మొక్కుతాడన్న వజ్రేష్ యాదవ్!

దిశ, తెలంగాణ బ్యూరో: భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద అని, సీఎం రేవంత్ రెడ్డి పై ఆయన ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కుత్బుల్లాపూర్‌లో తిరగనీయమని కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్‌లో గెలిచి ఆ పార్టీని బేరం పెట్టారని, వివేకానంద ఎన్ని పార్టీలు మారిండో ఆయన గుర్తు చేసుకోవాలి శ్రీశైలం గౌడ్ హితవు పలికారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించన మీడియా సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ వివేకానంద కమ్యూనిస్టు పార్టీ తప్ప అన్ని పార్టీలు మారిండని, టీడీపీలో చేరి ఆ పార్టీని నిండా ముంచిండని ఆరోపించారు. మూడు సార్లు గెలిచి కుత్బుల్లాపూర్‌కు చేసిందేమీ లేదని, ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదని కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ భూములన్నీ కేటీఆర్, హరీష్ రావులకు అమ్మించిన ఘనత వివేకానందదే అని ఆయన ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావు గురించి మాట్లాడే స్థాయి వివేకానందకు లేదని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే వివేకానంద మా సీఎం కాళ్లు మొక్కుతడు: మల్కాజిగిరి డీసీసీ చీఫ్ తోటకూర వజ్రేష్ యాదవ్
ఎమ్మెల్యే వివేకానంద చాటు మాటున మా సీఎం కాళ్లు మొక్కుతాడని, బయటకు వచ్చి సీఎంని తిడతాడని మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. ఎమ్మెల్యే వివేకానంద కుత్బుల్లాపూర్ కు పదేళ్లు ఏమి చేయలేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్ లు చెప్పింది మాత్రమే చేసిండని విమర్శించారు. రౌడీలు మీరు, మీరు రౌడీయిజం పేరుతో భూములు గుంజుకున్నారని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సగం ప్రభుత్వ భూములు కబ్జా చేశారుని వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. మల్లారెడ్డి కాలేజీల మీద విచారణ నడుస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. వివేకానంద కేసిఆర్ ఫాంహౌస్ దగ్గర కట్టిన ఇందిరమ్మ ఇండ్లు చూడాలని, మీ హయాంలో ఎన్ని ఏండ్లు ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో చర్చ పెడదామా? వజ్రేష్ యాదవ్ సవాల్ విసిరారు. మీరు చేసిన మోసాలను బయట పెడతామని వజ్రేష్ యాదవ్ హెచ్చరించారు.






