- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈత సరదా.. చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

దిశ, మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానిక గ్రామంలో ఒక్కసారిగా శోకసంద్రం అలుముకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొటే వివేక్ (10), బోయ మనిశ్వర్ (11) నాల్గవ తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంగళవారం సాయంత్రం వేళలో ఆడుకుంటూ సమీపంలోని చెరువు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే, నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తూ వారు నీట మునిగిపోయారు. చిన్నారులు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు నీటిలో విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే అప్పటివరకు నవ్వుతూ ఆడుకున్న పిల్లలు శవాలుగా మారడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు బొంపల్లి ఎస్సై హరీష్ గౌడ్ తెలిపారు .






