- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోతో ఢీకొట్టి యువకుడి హత్య..
పాత కక్షలు నేపథ్యంలో ఓ వ్యక్తిని ఆటోతో గుద్ది హత్య చేసిన ఘటన చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో జరిగింది.

దిశ, చేగుంట: పాత కక్షలు నేపథ్యంలో ఓ వ్యక్తిని ఆటోతో గుద్ది హత్య చేసిన ఘటన చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ (25)చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళుతుండగా అనంతసాగర్ గ్రామ శివాజీ విగ్రహం వద్ద అందరూ చూస్తుండగా.. యువకుడిని హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్ బైకుపై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన యాట శ్రీధర్‌ను ఆటోతో వెంబడించి హత్య చేసి పరారైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆటో విషయంలో గొడవ జరిగి..
ఈ ఘటనలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్‌పై ఉన్న మరో వ్యక్తి కాలు విరిగిపోయింది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుడు రణబోయిన ప్రభాకర్ అదే గ్రామానికి చెందిన మృతుడు శ్రీధర్ వరుసకు చెల్లిని గత 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాల మధ్యలో కక్షలు పెరిగినట్లు తెలుస్తుంది. గతంలో కూడా మృతుడు శ్రీధర్‌కి ప్రభాకర్ కి ఆటో విషయంలో గొడవ జరిగి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రభాకర్‌పై చిన్న శంకరంపేట పోలీసు స్టేషన్‌లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. మృతుడు శ్రీధర్‌కి భార్య శ్యామల రెండు నెలల పాప ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీయమని పోలీసులతో వాగ్వాదంపెట్టుకున్నారు. మృతదేహం వద్ద కుటుంబాలు సభ్యుల రోదనలు మిన్నంటాయి.






