చినవెంకన్నకు భారీగా ఆదాయం

by Vemula.Srinu Prasad |

ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 14.రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది...

చినవెంకన్నకు భారీగా ఆదాయం
X

దిశ, ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 14.రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,70,53,076 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాధరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకలు రూపేణా 147 గ్రాముల బంగారం 2, కేజీల 510 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాధరావు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది..

Next Story