- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఆర్ఎఫ్ సిబ్బందికి హైడ్రా కమిషనర్ అభినందనలు
నగర శివార్లలోని మౌంట్ ఒపేరా వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆటోడ్రైవర్ కాలులోంచి దూసుకెళ్లిన ఇనుప రాడ్డును చాకచక్యంగా కట్ చేసి.. ప్రాణాపాయ స్థితి లేకుండా కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం అభినందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నగర శివార్లలోని మౌంట్ ఒపేరా వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆటోడ్రైవర్ కాలులోంచి దూసుకెళ్లిన ఇనుప రాడ్డును చాకచక్యంగా కట్ చేసి.. ప్రాణాపాయ స్థితి లేకుండా కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం అభినందించారు. బాటసింగారం పండ్ల మార్కెట్ నుంచి ఆటో నిండా పండ్ల బుట్టలతో నగరానికి వస్తున్న ఆటోను వెనుక నుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఆటో అదుపుతప్పి పక్కనే రైలింగ్‌ను అంతే వేగంతో ఢీకొట్టింది. క్షణంలో రైలింగ్ రాడ్డు ఆటో డ్రైవర్ బల్లె బంగారయ్య (40) కుడికాలులోంచి దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న అతని కుమార్తె పక్కనుంచి అదే రాడ్డు వెళ్లి ఆటో పైభాగంలో తేలింది. ఆటో డ్రైవర్ కుమార్తెకు ఎలాంటి గాయాలు కాలేదు. భరించరాని నొప్పితో ఆటో డ్రైవర్ విలవిలలాడుతుంటే.. ఆయన కుమార్తె ప్రాణం పోయేట్టు రోధించింది. అక్కడివారు వెంటనే హైడ్రా కంట్రోల్ రూంకు 9000113667 ఫోను చేశారు. ఉదయం 10.40 గంటలకు ఫోను రాగా.. రెండు బృందాలు ఇరువైపుల నుంచి 15 నిమిషాల్లో చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాలు వద్ద ఇనుప రాడ్డు కదలకుండా.. బ్యాటరీ గ్రైండింగ్ మెషిన్‌తో చాకచక్యంగా కట్ చేసి 108 అంబులెన్స్ సిబ్బందికి అప్పగించారు. ఇలా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అధిక రక్తశ్రావం అవ్వకుండా ప్రాణాలు కాపాడిన రెండు హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల్లోని 8మందిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అభినందించారు. నగదు బహుమతితో పాటు.. ప్రశంసా పత్రాలను అందజేసి.. నగర ప్రజలకు సేవలందించడంలో క్షణ కాలం కూడా వృథా కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. కె. లింగస్వామి, బి. కృష్ణ, ఎం. జగన్, జి. పవన్, కె. సునిల్ చౌహాన్, ఓ. రాహు, ఓ. మధు, ఎస్. రాజేందర్ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.






