- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రస్తుత సంక్షోభ కాలంలో కమ్యూనిస్టుల పాత్ర మరింత కీలకం: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయాలని - ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఎఐటీయూసీ) ఆధ్వర్యంలో గౌతంపూర్ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం నిర్వహించిన ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్యవర్గ సభ్యులు, పిట్ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ఎఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షబీర్ పాషా హాజరై కార్మిక ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు, ట్రేడ్ యూనియన్‌ల బాధ్యతలు, కార్మిక హక్కుల పరిరక్షణ అంశాలపై ప్రసంగించారు. శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ఎఐటీయూసీ నాయకులు సింగు నర్సింహారావు చారిత్రక భౌతికవాదం, అంశంపై సమగ్రంగా వివరించారు. అనంతరం వి.మల్లికార్జునరావు లేబర్ కోడ్స్‌పై అవగాహన, కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల కార్మికులపై పడే ప్రభావాన్ని వివరించారు. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో సాంబశివరావు వర్తమాన పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పాత్ర, అనే అంశంపై మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.
అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కావాలి..
అనంతరం ఎస్.కె.షబీర్ పాషా కులం–వర్గం–వర్గపోరాటాలు–సామాజిక న్యాయం, అంశంపై ప్రసంగిస్తూ సామాజిక న్యాయం సాధనలో వామపక్ష ఉద్యమాల పాత్రను వివరించారు. కొరిమి రాజ్ కుమార్ ప్రసంగిస్తూ,ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు, కార్మిక చట్టాల అమలు వంటి అంశాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం, అవసరమైతే పోరాటాలు నిర్వహించడం ట్రేడ్ యూనియన్ల ప్రధాన బాధ్యత అని వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కావడానికి సహకరించిన నాయకులు,కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సత్తుపల్లి కార్యదర్శి సముద్రాల సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి గట్టయ్య, సూర్య ప్రకాష్, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హుమాయూన్, హీరాలల్, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శిలు భూక్యా రమేష్, ఏం ఆర్ కే ప్రసాద్, మధుకృష్ణ, కమల్, కిషోర్, చారి, భీమయ్య, అప్పారావు, బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.






