గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

by velandi.Saikiran |

వెంకటాపూర్ మండల కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు సోమవారం చాకచక్యంగా పట్టుకున్నారు.

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెంకటాపూర్, రామప్ప: వెంకటాపూర్ మండల కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు సోమవారం చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1060 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కుడుముల సన్నీ, అతని స్నేహితుడైన మదనపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణాకు తెరలేపారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుండి గంజాయిని తీసుకువచ్చి, ములుగు పరిసర ప్రాంతాల్లోని వివిధ వ్యక్తులకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 1060 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ. 8,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Next Story