మెట్రో ఫేజ్ 2 పై బీఆర్ఎస్ వి రాజకీయాలు: భువనగిరి ఎంపీ చామల

by Malleboina Mahesh |

మెట్రో ఫేజ్ 2పై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది.. కేటీఆర్ పదేళ్ల పాలన 'షోలే' కాదు 'హౌలే' సినిమా అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ తీవ్ర కౌంటర్!

మెట్రో ఫేజ్ 2 పై బీఆర్ఎస్ వి రాజకీయాలు: భువనగిరి ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్, హరీష్ రావులు చేసిన కామెంట్లకు భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విజన్ తో ముందుకు పోతుంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారని, సీఎంపై బావ, బామ్మర్దులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్ళతో అంటకాగి సినిమా మాటలు మాట్లాడుతున్నారని, ప్రజల జీవితాలు కేటీఆర్ కు సినిమాలాగా కనపడుతున్నాయని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా? కేటీఆర్, మీ పదేళ్ల పాలనలో మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయింది, మీ పాలన షోలే సినిమా కాదు హౌలే సినిమా అని ఆయన చురకలు అంటించారు.

రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, విద్య, వైద్యం, రైతులకు మేలు చేయాలని రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారన్నారని ఎంపీ చామల తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని, ఆ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి క్రాప్ డైవర్షన్ పై అవగాహన కల్పిస్తున్నారని, రాష్ట్రంలో ధాన్యం అత్యధిక దిగుబడి వస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెలంగాణ వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం ప్రశ్నిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెట్రో ఫేజ్ 2పై బీఆర్ఎస్ రాజకీయాలు చెస్తోందని, మెట్రో ఫేజ్ 2 పై కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు.

దాని కోసం సంప్రదింపులు చేసి ఎల్ అండ్ టీ కి ఎగ్జిట్ ఇచ్చి మెట్రో ఫేజ్ 2 ను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల వెల్లడించారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పిస్తే కలిసి అభివృద్ధిలో ముందుకు పోదాం అని రేవంత్ రెడ్డి అంటున్నారని, కేటీఆర్ బాధ్యతతో ప్రజల కోణంలో మాట్లాడాలి, హైడ్రా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, హైడ్రా హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకంగా మారిందని, నగరం ముంపుకు గురి కాకుండా హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నాళాలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టాలని హైడ్రా భావిస్తోందా?, బీజేపీ ఓట్ చోరీ, సీట్ చోరీ గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఎంపీ చామల నిలదీశారు.

Next Story