- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : సోనీ బాలదేవి
జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి తెలిపారు.

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఎఫ్‌వో బాలమణితో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో క్రీడారంగ అభివృద్ధితో పాటు క్రీడా మైదానాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్ క్రీడా మైదానం, కౌటాల మినీ స్టేడియం అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం క్రీడాశాఖ అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని జనకాపూర్ క్రీడా మైదానం, ఆదర్శ క్రీడా పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థినులు సాధించిన పతకాలు, ట్రోఫీలను పరిశీలించి వారిని అభినందించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. క్రీడలను ఉపాధి అవకాశంగా మలుచుకుని ఆర్థికంగా ఎదిగి తల్లిదండ్రులకు అండగా నిలవడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.






