- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనంతో గ్రామానికి మేలు
తుర్కపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమిని అక్రమంగా లేఔట్‌గా మార్చి ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్న వ్యవహారాన్ని **దిశ** పత్రిక వెలుగులోకి తీసుకురావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

దిశ, ముస్తాబాద్ : తుర్కపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమిని అక్రమంగా లేఔట్‌గా మార్చి ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్న వ్యవహారాన్ని **దిశ** పత్రిక వెలుగులోకి తీసుకురావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యవసాయ భూమిలో మట్టి పోసి, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ప్లాట్లు ఏర్పాటు చేసి అమాయక ప్రజలను ఆకర్షిస్తూ విక్రయాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో **దిశ** క్షేత్రస్థాయిలో పరిశీలించి కథనాన్ని ప్రచురించింది. కథనం ప్రచురితమైన అనంతరం సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఎలాంటి అనుమతులు లేకుండానే లేఔట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు చేయవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారుల జోక్యంతో ప్రస్తుతం అక్కడ ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో లేఔట్ కోసం పోసిన మట్టిని తుర్కపల్లి గ్రామ రైతులు, గ్రామస్తులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారి అభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నారు. దీంతో అక్రమ లేఔట్‌గా మారే ప్రమాదం ఉన్న భూమి ప్రస్తుతం గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతోంది. అక్రమ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన దిశ పత్రికను గ్రామస్థులు అభినందించారు. ప్రజలను మోసం చేసే అక్రమార్కులపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ లేఔట్లు పునరావృతం కాకుండా పటిష్ట నిఘా కొనసాగించాలని కోరారు. అధికారులు జారీ చేసిన హెచ్చరికల మేరకు ఆ స్థలంలో ఎలాంటి ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు చేయవద్దని, మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, గ్రామ సర్పంచ్ సూచించారు.






