ఉగ్రకుట్ర కేసు.. హైదరాబాద్‌కు చెందిన మహిళా అరెస్ట్

by Malleboina Mahesh |   (  Updated:2026-03-25 02:44:22  IST  )

విజయవాడ ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్‌లో సయిదా బేగం అరెస్ట్! ఇన్ స్టాగ్రామ్ గ్రూపుల ద్వారా నెట్‌వర్క్.. పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలపై అధికారుల ఆరా.

ఉగ్రకుట్ర కేసు.. హైదరాబాద్‌కు చెందిన మహిళా అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో విజయవాడలో (Vijayawada) నగరంలోని వించిపేట (Vinchipeta)లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టి.. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్‌లను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఈ ఉగ్రకుట్రలు హైదరాబాద్ కు పాకాయి.

దీంతో అప్రమత్తం అయిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సయిదా బేగం అనే మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను టూటౌన్ పీఎస్ లో సయిదాబేగంను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఉగ్ర లింకుల కేసులో సయిదా బేగం కీ రోల్ పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే 2025 జూన్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయడం తో అప్రమత్తం అయిన సయిదా బేగం అండ్ టీమ్.. పోలీసులకు తమపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో "అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్" పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ఇందులో సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్ తో పాటు 12 మంది ఈ గ్రూప్ లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ గ్యాంగ్ సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఈ గ్రూపులో మిగిలిన సభ్యులు అయిన బీహార్ వాసి దిల్కాష్ సహా మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story