- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుదుచ్చేరి బరిలో విజయ్ 'టీవీకే' ఒంటరి పోరు.. 30 మంది అభ్యర్థుల ప్రకటన
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్న విజయ్ (TVK). 30 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఫలితాలు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ (Vijay) పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. వచ్చే నెల ఏప్రిల్ 9న జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో (Puducherry Assembly Elections) తమ టీవీకే పార్టీ (TVK Party) ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటిస్తూ.. మొత్తం 30 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఏ కూటమితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న టీవీకే, ప్రధాన పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటములకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజాగా విజయ్ ప్రకటించిన వారిలో ముఖ్యమైన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే.. లాస్పేట నుండి వి. సామినాథన్, రాజ్‌భవన్ నుండి వి.జె. చంద్రన్, నెట్టపాక్కం నుండి ఎల్. పెరియసామి, అరియాంకుప్పం నుండి ఎస్. కుమారవేలు తదితరులు పోటీ చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్) స్వస్థలం పుదుచ్చేరి కావడంతో ఇక్కడ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన విజయ్, అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.






