విజయ్ సేతుపతి బర్త్ డే ట్రీట్.. ఎవరూ ఆపలేని తుఫాను ఉద్భవిస్తుందంటూ మేకర్స్ షాకింగ్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-16 06:23:29  IST  )

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)- పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కాంబినేషన్ ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

విజయ్ సేతుపతి బర్త్ డే ట్రీట్.. ఎవరూ ఆపలేని తుఫాను ఉద్భవిస్తుందంటూ మేకర్స్ షాకింగ్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)- పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కాంబినేషన్ ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా మాస్, రా అండ్ రియలిస్టిక్ కథతో పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. విజయ్ సేతుపతి ఇమేజ్‌కు పూరి మార్క్ ఇంటెన్స్ స్టోరీ కలిస్తే ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా పెరిగింది. అధికారిక ప్రకటన విడుదలైనప్పటికీ నుంచి ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు.. విజయ్ సేతుపతి పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

పూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్లమ్‌డాగ్’(Slumdog) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. నోట్ల కట్టల మధ్య, చేతిలో రక్తంతో కారుతున్న కత్తి, ముఖంపై క్రూరమైన ఎక్స్‌ప్రెషన్‌తో విజయ్ సేతుపతి కనిపించడం సినిమాకు ఉండబోయే వైలెన్స్, ఇంటెన్సిటీని స్పష్టంగా చూపిస్తోంది. మురికివాడల నేపథ్యంలో బిచ్చగాడిగా కనిపించే పాత్ర నుంచి.. ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగే ఓ ప్రమాదకరమైన మనిషి ప్రయాణమే ఈ కథ అని హింట్ ఇస్తోంది.

‘‘మురికివాడల నుండి.. ఎవరూ ఆపలేని తుఫాను ఉద్భవిస్తుంది.. జాలి దయలేని క్రూరమైన వ్యక్తిని చూడబోతున్నారు’’ అనే క్యాప్షన్ జత చేయడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథకు బలమైన మలుపులు తిప్పనున్నాయని సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా సాగుతోంది.

Read More..

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు.. అఫీషియల్ ప్రకటనతో అంతా షాక్!

Next Story