ఎట్టకేలకు ‘జననాయగన్’ కాంట్రవర్సీపై స్పందించిన విజయ్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay) పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు ‘జననాయగన్’ కాంట్రవర్సీపై స్పందించిన విజయ్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay) పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. ఇక విజయ్ చివరి సినిమాగా ‘జన నాయగన్’(Jana Nayagan) రాబోతున్న విషయం తెలిసిందే. ఇది హెచ్ వినోత్(H Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్‌గా రాబోతున్నట్లు టాక్. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా జనవరి 9 సంక్రాంతి కానుకగా.. విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ అభ్యంతరాల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక అప్పటినుంచి వివాదాలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. కానీ చిక్కుల నుంచి బయటపడటం లేదు.

ఇక ఈ సినిమాతో విజయ్‌ని చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న అభిమానుల కోరిక నెరవేరకపోగా.. నిరాశ ఎదురవుతూ ఆందోళనను కలిగిస్తోంది. ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు సైలెంట్‌గా ఎదుర్కొన్న విజయం ఈ విషయాలపై స్పందించలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, ‘జననాయగన్’వాయిదాపై ఎమోషనల్ అయ్యారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని అనుకున్నాను. సినిమాలు చేసే అవకాశం లేదు కాబట్టి ఏం జరిగినాఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను. నా రాజకీయాల వల్ల సినిమాలు ప్రభావితం కావచ్చని నేను ముందే ఊహించాను. అందుకే ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాను. కానీ జన నాయగన్ విషయంలో మాత్రం మా నిర్మాతలను చూస్తే బాధగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story