- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్డీయే కూటమిలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన టీవీకే విజయ్
పొత్తులపై పుకార్లు నమ్మవద్దు, మాది ప్రజల జట్టు! సెక్యులరిజం, సోషల్ జస్టిస్ విషయంలో రాజీ పడం: మహాబలిపురం సభలో విజయ్ సంచలన వ్యాఖ్యలు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టీవీకే పార్టీ (TVK party) ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. విజయ్ (Vijay) ఎన్డీయే కూటమి (NDA alliance)తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని, దీనికి ఆయనకు అత్యంత సన్నిహితురాలు అయిన ఓ హీరోయిన్ కేంద్ర హోంమంత్రితో చర్చలు జరుపుతోందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ చెక్ పెట్టారు.
మహాబలిపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఏదో ఒక కూటమిలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేశారు. "మేము ప్రజల పక్షాన ఉండే టీమ్. మమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏవీ పని చేయలేదు. ఇప్పుడు మేము ఫలానా కూటమిలోకి వెళ్తున్నామంటూ కావాలనే తప్పుడు ప్రచారం (Fake Campaign) చేస్తున్నారు. దయచేసి అటువంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దు" అని విజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తమ పార్టీ సిద్ధాంతాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని హీరో విజయ్ (hero Vijay) స్పష్టం చేశారు. "మేము ఎప్పుడూ సెక్యులరిజం (లౌకికవాదం), సామాజిక న్యాయం (Social Justice) వైపే ఉంటాం. ఈ విషయంలో ఎవరితో రాజీ పడబోము. రాబోయే ప్రభుత్వం మా నాయకత్వంలోనే ఉంటుంది. మన లక్ష్యం వైపు మనం కచ్చితంగా అడుగులు వేస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా టీవీకే పార్టీ బీజేపీ లేదా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోబోతుందంటూ వస్తున్న వార్తలకు ఈ ప్రసంగం ద్వారా ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. 234 నియోజకవర్గాల్లో సొంతంగా సత్తా చాటడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఆయన సమాయత్తం చేశారు.






