- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతి శక్తులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని టీవీకే శ్రేణులకు విజయ్ పిలుపు
తమిళనాడు ఉన్న అవినీతి శక్తులను విజిల్ ఊది.. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని టీవీకే శ్రేణులకు హీరో విజయ్ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ఉన్న అవినీతి శక్తులను విజిల్ ఊది.. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని టీవీకే శ్రేణులకు హీరో విజయ్ పిలుపునిచ్చారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హీరో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీని ఒక "స్వచ్ఛమైన శక్తి" (Pure Force) గా అభివర్ణించారు. తమిళనాడును పాలిస్తున్న "చెడు, అవినీతి శక్తులను" (Evil and Corrupt forces) ఓడించే సత్తా కేవలం తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కేటాయించిన 'విజిల్' (Whistle) గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు ఊదే విజిల్ శబ్దానికి అవినీతి శక్తులు భయపడి పారిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టాలిన్ నిద్రలో కూడా 'విజిలే'..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న హీరో విజయ్.. ఎం.కె. స్టాలిన్, డీఎంకే ప్రభుత్వంపై తన విమర్శల పదును పెంచారు. "రాష్ట్రంలో డీఎంకే చేసే తప్పులను ఎత్తిచూపే ధైర్యం గతంలో ఎవరికీ లేదని, ఇప్పుడు తాము ఆ పనిని కొనసాగిస్తామని విజయ్ స్పష్టం చేశారు. స్టాలిన్ నిద్రలో కూడా టీవీకే భయం వెంటాడుతోందని, ఆయనను ఎవరైనా నిద్రలో లేపి ఏ గుర్తుకు ఓటు వేస్తారని అడిగితే 'విజిల్' గుర్తుకే అని చెబుతారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. తమ పార్టీ కేవలం నగరాలకే పరిమితం కాలేదని, పల్లెపల్లెనా విజిల్ వినిపిస్తోందని పేర్కొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఈ సందర్భంగా హీరో విజయ్ ధీమా వ్యక్తం చేశారు.






