- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విలన్‌గా మారనున్న Samantha.. అభిమానుల్లో మొదలైన ఉత్కంఠ
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విలన్ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది..Latest Telugu News

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విలన్ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'పుష్ప'లో ఐటమ్ సాంగ్‌తో అలరించిన నటి త్వరలో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో సరికొత్త క్యారెక్టర్ చేయనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. సామ్ విలన్‌గా నటిస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇక సమంత, విజయ్ కాంబినేషన్‌లో.. పోలీసోడు, మెర్సల్, కత్తి వంటి చిత్రాలు విజయవంతమైన సంగతి తెలసిందే.
కాగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత విభిన్న క్యారెక్టర్లు చేయడానికి మొగ్గు చూపుతున్న సామ్.. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లో బోల్డ్ పాత్రలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం 'శకుంతలం', 'యశోద' వంటి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.






