యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న వీడియో ఇదే!

by Dishanational1 |
యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న వీడియో ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: గమ్యం చేరే మార్గంలో చాలా మంది నిరాశ, నిస్పృహల్లో ఉంటారు. ఇంకొంతమంది అయితే, అది కష్టమైన పని అబ్బో నా వల్ల కాదు అంటూ వెనకడుగు వేస్తుంటారు. ఇంకొందరైతే అమ్మో నేను చేయలేను అంటుంటారు. అలాంటివారు ఈ వీడియో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అన్నీ ఉన్న మనం గమ్యం చేరేందుకు వెనుకడుగు వేస్తుంటే ఈ వీడియో మనలో స్ఫూర్తిని నింపుతది. అంతేకాదు.. మనం వెనుకడుగు వేయకుండా ముందుకు నడుపుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. దివ్యాంగ విద్యార్థిని బాస్కెట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతూ వైరల్ చేస్తున్నారు. స్ఫూర్తివంతంగా ఉందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియోను నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed