- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆహాలో మరో కొత్త వెబ్ సిరీస్.. ఫప్ అండ్ ఫ్రెస్టేషన్‌గా ట్రైలర్ !
సినిమాలు, సిరీస్‌లు అనే తేడా లేకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఆహా (aha) ఎప్పుడు ముందే ఉంటుంది.

దిశ, సినిమా: సినిమాలు, సిరీస్‌లు అనే తేడా లేకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఆహా (aha) ఎప్పుడు ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహా వేదికగా ఇప్పుడు మరో కొత్త సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. వరుణ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్న ‘వేరే లెవెల్ ఆఫీస్’ (Vere Level Office) అనే కొత్త సిరీస్‌కు సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆర్ జే కాజల్ (RJ Kajal), అఖిల్ సార్థక్ (Akhil Sarthak), శుభశ్రీ (Subhashri), మిర్చి కిరణ్ (Mirchi Kiran), రీతు చౌదరి (Ritu Chaudhary), స్వాతి చౌదరి (Swati Chaudhary), వసంతిక (Vasantika), మహేశ్ విట్టా (Mahesh Vitta) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 12వ తేదీ నుంచి ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఫప్ అండ్ ఫ్రెస్టేషన్‌గా ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.






