భారత్‌ను ట్రంప్ గౌరవించాల్సిందే: వెంకయ్య నాయుడు

by Gantepaka Srikanth |

అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

భారత్‌ను ట్రంప్ గౌరవించాల్సిందే: వెంకయ్య నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ గ్రౌండ్స్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. రైతు బిడ్డగా పుట్టిన నాకు రైతులంటే ఎంత అభిమానమో రైతులకు సంబంధించిన పండుగలన్నా అంతే ఆసక్తి. తెలుగు లోగిళ్ళకు తొలి కాంతిని తీసుకువచ్చే సంక్రాంతి, అచ్చంగా తెలుగు రైతుల పండుగ.

పండుగ అంటే కొత్తబట్టలు మాత్రమే కాదు

పండుగ అంటే కొత్తబట్టలు, పిండి వంటలే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలు. మన ఆచార వ్యవహారాలు. మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి, పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి, పదిమందికీ సాయం చేయాలనే భారతీయ సంస్కృతిని భావితరాలకు తెలియజేసే మార్గాలే పండుగలు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. సంక్రాంతి అంటే అది ప్రకృతి పండుగ. ప్రకృతిలోని ప్రతి జీవితో మన ఆనందాన్ని పంచుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతితో కలిసి జీవించాలి. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే భారతీయ సంస్కృతి కీలక భావన షేర్ అండ్ కేర్ సంక్రాంతిలో కనిపిస్తుంది’ అని అన్నారు.

చివరగా.. భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి సరికాదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను ట్రంప్ గౌరవించాలని అభిప్రాయపడ్డారు.

Next Story