హైవేపై వాహనం టైర్ బ్లాస్ట్

by Ratna Kumari |   (  Updated:2026-07-05 15:35:31  IST  )

హదారిపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయి, లారీని ఢీకొన్న సంఘటనలో, అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో సహా చిన్న పాప స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలోని 44 వ హైవేపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

హైవేపై వాహనం టైర్ బ్లాస్ట్
X

దిశ భిక్కనూరు : రహదారిపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయి, రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో, అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో సహా చిన్న పాప స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలోని 44 వ హైవేపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా చల్మెడ గ్రామానికి చెందిన భాస్కర్, శ్యామల తో పాటు, చిన్న పాప విహారయాత్రలకు వెళ్లి కామారెడ్డిలో దిగారు. వారు అక్కడ పార్క్ చేసి ఉంచిన తమ కారులో స్వగ్రామానికి వస్తుండగా, భిక్కనూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత పియూసీ సమీపంలో ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న వాహనం వెనుక టైరు బ్లాస్ట్ అయి ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులు గాయపడగా, చికిత్స కోసం వారిని వెంటనే 108 అంబులెన్స్ లో మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి షిఫ్ట్ చేయగా అక్కడ చికిత్స పొందుతున్నారు. హైవేపై ట్రాఫిక్ జాం కాకుండా స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జిఎంఆర్ సిబ్బంది సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇది ఇలా ఉండగా ఇదే సమయంలో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకొని వాహనాన్ని పక్కకు ఆపించి, గాయపడ్డ వారి వద్దకు వెళ్లి, పరామర్శించి ధైర్యం నూరి పోశారు. గాయపడ్డ క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలని పోలీసులకు సూచనలు చేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

Next Story