- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడీసీ జరిమానా వివాదం.. రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్యాయత్నం
బోధన్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎడపల్లి శివారులోని రైలు పట్టాల పై పడుకొని ఆత్మహత్య చేసుకుంటానని శుక్రవారం ఉదయం హల్చల్ చేశాడు.

దిశ, బోధన్: బోధన్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎడపల్లి శివారులోని రైలు పట్టాల పై పడుకొని ఆత్మహత్య చేసుకుంటానని శుక్రవారం ఉదయం హల్చల్ చేశాడు. ఎలాంటి తప్పు చేయకుండానే నాపై జరిమానా వేటు వేశారని ఆ యువకుడు గ్రామ అభివృద్ధి కమిటీ పై ఆరోపణలు చేశారు. గుర్తుతెలియని క్రిమిసంహారక మందులు సేవించి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానిక ప్రజలు ఆయనను బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఎలాంటి తప్పు చేయకుండానే విడిసి కమిటీ ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున జరిమానా విధించడంతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఇలా ఉండగా ఘటనపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరో రూపంలో ఆ ఇద్దరు యువకులు చేసిన అఘాయిత్యం గురించి వివరించారు. వ్యవసాయ పొలంలో జరిగిన దొంగతనం ఘటనలో సంబంధిత యువకుల ప్రమేయం ఉన్నట్లు తెలియడం వల్లనే గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున జరిమానా విధించినట్లు కమిటీ వారు తెలిపారు. ఆ మొత్తాన్ని గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం వినియోగించుటకై నిర్ణయం తీసుకున్నట్లు వీడిసి సభ్యులు పేర్కొన్నారు. అదే ఘటనలో మరో యువకుడి నుంచి పదివేల జరిమానా తీసుకున్నప్పటికీ అతనికి ఆ డబ్బులు తిరిగి ఇచ్చిన విషయం పై ప్రశ్నించగా ఆ వ్యక్తికి ఘటనతో సంబంధం లేదని తేలడంతో డబ్బులు తిరిగి ఇచ్చినట్లు కమిటీ సభ్యులు వెల్లడించిన విషయం బహిర్గతమవుతుంది. యువకుడి ఆత్మహత్య ప్రయత్నంతో ఎడపల్లి మరియు బోధన్ మండలాలలో కలకలం రేపింది.






