కర్ణాటకలో దారుణం.. భర్తను కిరాతకంగా చంపి పక్కనే ఫోన్ చూస్తూ పడుకున్న భార్య

by Ajay Maddhiboyina |

క‌ర్ణాట‌క‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య త‌న‌ భ‌ర్త‌ను హ‌త్య చేసి, కొడుకును క‌త్తితో పొడిచి ప‌క్క గ‌దిలోనే ఫోన్ చూస్తూ కూర్చుంది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కర్ణాటకలో దారుణం.. భర్తను కిరాతకంగా చంపి పక్కనే ఫోన్ చూస్తూ పడుకున్న భార్య
X

దిశ, వెబ్ డెస్క్: క‌ర్ణాట‌క‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య త‌న‌ భ‌ర్త‌ను హ‌త్య చేసి, కొడుకును క‌త్తితో పొడిచి ప‌క్క గ‌దిలోనే ఫోన్ చూస్తూ కూర్చుంది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్‌లో కిరణ్, ప్రియాంక దంపతులు తమ పదేళ్ల కుమారుడితో నివాసం ఉంటున్నారు. కిరణ్ అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తుండగా, ప్రియాంక కంటి డాక్టర్ గా పనిచేస్తున్నారు. కాగా బుధవారం సాయంత్రం భర్త, కుమారుడిపై ప్రియాంక కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలైన కిరణ్ అక్కడిక్కడే మరణించగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

బుధవారం రాత్రి ఓ సర్జరీ ఉండటంతో ఆస్పత్రి నుండి పలుమార్లు ఫోన్ చేసినా కిరణ్ స్పందించలేదు. మరోవైపు కిరణ్ కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేసినప్పుడు ప్రియాంక పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆస్పత్రికి వెళ్లొచ్చి అలసిపోయి పడుకున్నాడని తెలిపింది. దీంతో అనుమానం వచ్చి వారు ఇంటికి రాగా ప్రియాంక డోర్ తెరిచేందుకు సైతం నిరాకరించింది. కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో డోర్ తెరిచింది. వారు లోపలికి వెళ్లి చూడగా కిరణ్ రక్తపు మడుగులో పడిఉన్నాడు. పదేళ్ల కుమారుడిపై సైతం తీవ్రగాయాలు ఉన్నాయి. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని ఖంగుతున్నారు.

పక్కనే కుమారుడు గాయాలతో ఉండగా, భర్త రక్తపు మడుగులో ఉన్నప్పటికీ ప్రింయాక ప్రశాంతంగా ఫోన్ చూస్తూ కనిపించింది. బాబు శ్వాస తీసుకుంటున్నట్టు కనిపించడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడంతో షుగర్ లెవల్స్ పడిపోయి ఆమె స్పృహ కోల్పోయింది. ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి చికిత్స అందించ‌డంతో ఆమె కోలుకుంది. విచార‌ణ‌లో ప్రియాంక పొంత‌న‌లేని స‌మాధానాలు చెబుతుండ‌టంతో పోలీసులు ఆమె మానసిక ప‌రిస్థితిపై సైతం అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా భార్య భ‌ర్త‌ల మ‌ధ్య కొంత‌కాలంగా విబేధాలు త‌లెత్తాయ‌ని కిర‌ణ్ బంధువులు చెబుతున్నారు. ఇద్ద‌రూ విడాకుల‌కు సైతం అప్లై చేసిన‌ట్టు తెలిపారు. అంతేకాకుండా ఇటీవ‌లే ప్రియాంక క‌త్తితో భ‌ర్త‌ను బెదిరించిన‌ట్టు చెప్పారు.

Next Story