- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రోటోకాల్ లేదు.. కుర్చీ లేదు! గిరిజన మహిళా సర్పంచ్‌కు ఘోర అవమానం
జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రుల సమక్షంలో పంచాయతీ ప్రథమ పౌరురాలైన గిరిజన మహిళకు అవమానం జరిగింది.

దిశ, అశ్వాపురం: జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రుల సమక్షంలో పంచాయతీ ప్రథమ పౌరురాలైన గిరిజన మహిళకు అవమానం జరిగింది. అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి పంచాయతీలోని సీతారామ ప్రాజెక్టు వద్ద గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు మరో ఇద్దరు మంత్రులు పర్యటించారు. కనీసం ఎటువంటి ప్రోటోకాల్ పాటించలేదు అసలు అక్కడ సర్పంచ్ ఊసే లేదు. ప్రాజెక్టు వద్ద జరిగిన పాత్రికేయుల సమావేశంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం గిరిజన మహిళా సర్పంచ్ ఇర్ప కవితను కనీసం వేదిక పైకి ఆహ్వానించలేదు.
ఆమె కూర్చునేందుకు సమావేశం వద్ద కుర్చీ కూడా లేకపోవడంతో సమావేశం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ఎమ్మెల్యే ఎదురుగా నిలబడే ఉంది. అంతే కాకుండా పంచాయతీలోని పలు సమస్యలను కుమ్మరిగూడెం నుండి అమ్మగారిపల్లికి రహదారి నిర్మించాలని, కుమ్మరిగూడెం వద్ద వాహనాలు దాటడానికి వంతెన నిర్మించాలని, కెనాల్‌కి ఇరువైపులా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, శ్రీ ఆంజనేయ స్వామి లిఫ్టుకు మరమ్మతులు చేయాలని, భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ మెమోరాండం తీసుకువచ్చినా సరే సర్పంచును పట్టించుకోలేదు. దీంతో గిరిజన మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ పాటించలేదని, అసలు సర్పంచ్ పేరే వినిపించలేదని, వినతి పత్రం అందజేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.






