- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జైలర్ 2'పై భారీ అంచనాలు.. అందుకే ఇంత ఆలస్యమా?
'జైలర్ 2' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు సన్ పిక్చర్స్ భారీ ధరను కోట్ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విడుదలకు ఎక్కువ సమయం లేకపోయినా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తికాలేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం 'జైలర్' తొలి భాగం తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి విజయం సాధించడమే.
ఆ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు రావడంతో, 'జైలర్ 2'పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు భారీ ధరను కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. అందుకే సినిమాపై మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల బిజినెస్ పూర్తికాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను చివరకు ఏ సంస్థ లేదా డిస్ట్రిబ్యూటర్ దక్కించుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.






