తెలంగాణలో కొత్త ఫించన్లపై BIG అప్‌డేట్.. ఆ రోజు నుంచి పించన్లు పంపిణీ

by Prasad Jukanti |

తెలంగాణలో ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.

తెలంగాణలో కొత్త ఫించన్లపై BIG అప్‌డేట్.. ఆ రోజు నుంచి పించన్లు పంపిణీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. తాజాగా ములుగు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ సందర్భంగా పించన్ల పంపిణీపై స్పందించారు. సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందజేలా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కాగా రాష్ట్రంలో కొత్త పించన్ల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కొత్త పించన్లను అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.

పారదర్శకంగా పించన్లు:

రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇస్తామని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. దాదాపు 2 నుంచి 3 లక్షల పించన్లు ఇచ్చేలా దిశగా కసరత్తు మొదలు పెట్టింది. పించన్ల పంపిణీ పారదర్శకంగా ఉండేలా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే వారి పేర్లను తొలగించి నిజమైన అర్హులకే పించన్లు వర్తింపచేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇచ్చిన తాజా అప్ డేట్ తో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అర్హులకు భారీ ఊరటగా మారింది.
Next Story