- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7 నెలల గర్భంతోనూ గాల్లో తెలుతున్న ఫైట్స్.. ‘రాకా’ షూటింగ్ పూర్తి చేసే ప్లాన్‌లో దీపికా పదుకొణె!
తన ప్రసూతి సెలవులకు వెళ్ళేలోపు ఈ ప్రాజెక్ట్‌ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించుకుందట.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. రెండోసారి తల్లికాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తిగా రెస్ట్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ప్రెగ్నెన్సీ రూల్స్ బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అయిన దీపికా.. ‘రాకా’ సినిమా కోసం దాదాపు ప్రతిరోజూ షూటింగ్‌లో పాల్గొంటున్నారట. పరిశ్రమలో ఎనిమిది గంటల పని విధానం ఉండాలని ఆమె గట్టిగా పోరాడుతున్నప్పటికీ, తన ప్రెగ్నెన్సీ వల్ల మూవీ షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని టాక్. తన ప్రసూతి సెలవులకు వెళ్ళేలోపు ఈ ప్రాజెక్ట్‌ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించుకుందట.
అందుకోసం రాత్రి షిఫ్టుల్లో పనిచేయడమే కాకుండా, ఎంతో శారీరక శ్రమతో కూడిన భారీ యాక్షన్ సీన్స్ గాల్లో తేలే ఫైట్స్ చేస్తూ మేకర్స్‌ను ఆశ్చర్యపరుస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. సినిమా రంగమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న మహిళల్లాగే, దీపికా కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తన పని పట్ల చూపిస్తున్న అంకితభావం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని నెటిజన్లు అంటున్నారు. కాగా.. క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ పాన్-ఇండియా చిత్రం సరికొత్త విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సీన్స్‌తో 2027లో థియేటర్లలోకి రాబోతోంది.






