ఫేక్ కాదు.. నిజంగానే ఫైట్ చేసిన వరుణ్ తేజ్

by Disha Web Desk 19 |
ఫేక్ కాదు.. నిజంగానే ఫైట్ చేసిన వరుణ్ తేజ్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏప్రిల్ 8న 'గని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్.. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 'గని' కోసమే ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాదు కరోనా సమయంలో కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేశానన్న హీరో.. ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరిస్తుందనే గట్టి నమ్మకం ఉందన్నాడు. సినిమా చూస్తున్నపుడు ఫేక్‌గా అనిపించకూడదని 'గద్దలకొండ గణేష్' సినిమాకు ముందు నుంచే బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు వివరించాడు. ఇక ఈ చిత్రం తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి.

Next Story

Most Viewed