వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికరం: కేంద్ర మంత్రి బండి సంజయ్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-25 08:02:11  IST  )

తెలంగాణ బీజేపీలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు.

వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికరం: కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి (Vanga Madhusudhan Reddy) ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే బండి సంజయ్ ఆస్పత్రికి చేరుకొని మధుసూదన్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నిబద్ధత కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోయిందని, ఆయన మృతి బీజేపీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

మధుసూదన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి భగవంతుని మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ప్రజా నాయకుడిగా పేరు ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైటెక్ సిటీలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి వార్త తెలియగానే చంపాపేట్ డివిజన్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన మధుసూదన్ రెడ్డి, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. స్థానిక సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి పేరు ఉంది.

READ MORE ....

చంపాపేట కార్పొరేటర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి కోమటి రెడ్డి

Next Story