చంపాపేట కార్పొరేటర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి కోమటి రెడ్డి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-25 08:00:50  IST  )

చంపాపేట్ కార్పొరేట‌ర్ వంగా మ‌ధు సూద‌న్ రెడ్డి శ‌నివారం రాత్రి మ‌ర‌ణించారు. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు.

చంపాపేట కార్పొరేటర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి కోమటి రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: చంపాపేట్ కార్పొరేట‌ర్ వంగా మ‌ధు సూద‌న్ రెడ్డి శ‌నివారం రాత్రి మ‌ర‌ణించారు. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు. కాగా నేడు ఆయ‌న భౌతిక‌కాయానికి మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. చంపాపేట్ అభివృద్ధితో పాటు ఏంతో మంది పేద‌ల‌కు సేవ చేశార‌ని అన్నారు. అంతేకాకుండా అయ్య‌ప్ప దేవాల‌యాన్ని నిర్మించడానికి ఆయ‌న ఎంతో కృషి చేశార‌న్నారు.

ఇటీవ‌ల కూడా త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న ప్రాంతానికి రోడ్లు కావాల‌ని అడిగార‌ని తాను సాంక్ష‌న్ చేశాన‌ని అన్నారు. చిన్న య‌వ‌సులో మ‌ధు సూద‌న్ రెడ్డి దూరం అవ్వ‌డం త‌న‌ను వ్య‌క్తిగ‌తంలో క‌లిచివేసింద‌న్నారు. వంగా మ‌ధుతో త‌న‌కు 30ఏళ్ల అనుబంధం ఉంద‌ని చెప్పారు. గొప్ప ప్ర‌జా నాయ‌కుడిని కోల్పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సొంత కుటుంబ స‌భ్యుడిని కోల్పోయినంత బాధ‌గా ఉంద‌ని అన్నారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఎంతో చురుకుగా వంగా రాజ‌కీయాల్లో అందరి అభిమానం సంపాదించుకున్నార‌ని చెప్పారు. వంగా మ‌ధు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలిపారు.

READ MORE ....

వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికరం: కేంద్ర మంత్రి బండి సంజయ్

Next Story