- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentines day: వచ్చేస్తోన్న వాలైంటైన్స్ డే.. ఫేస్‌ను ఇంటి చిట్కాలతో గ్లోగా మార్చుకోండి?
ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) సెలబ్రేట్ చేసుకుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు లవర్స్ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ప్రేమికులు తమ అభిమానాన్ని వ్యక్తపరచడానికి, బహుమతులు (gifts) కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (Valentine's Day) ను క్రైస్తవ తెగలు సెయింట్ వాలెంటైన్స్ డే(St. Valentine's Day)గా కూడా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల త్యాగానికి ప్రతిరూపంగా చెప్పుకుంటారు.
ప్రేమికుల రోజును ఎక్కువగా కెనడా(Canada), అమెరికా(America),యునైటేడ్ కింగ్‌డమ్(United Kingdom), ఇండియా(India), ఆస్ట్రేలియా(Australia), ఇటలీ(Italy), జపాన్ (Japan), డెన్మార్క్(Denmark) లో జరుపుకుంటారు. అయితే ప్రేమికుల రోజు ప్రేమికులు కొన్ని రొమాంటిక్ ప్రేసెస్(Romantic quotes)కు కూడా వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు.
వీటన్నింటికి ముందు అమ్మాయిలు ఫేస్ పై కేరింగ్ తీసుకుంటారు. ముఖ్యంగా మహిళల్ని వెంటాడే సమస్య పింపుల్స్(Pimples). ఈ సమస్యకు చెక్ పెట్టి.. ముఖం ప్రకాశవంతం(bright)గా మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటించండని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే బాడీలో హార్మోన్ లెవల్స్ (Hormone levels) దెబ్బ తిన్నప్పుడు ఫేస్ పై పింపుల్స్ సమస్య ఎదురవుతుంది. దీంతో ఫేస్ గ్లోనెస్ తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ (Junk food), ఆయిల్ ఫుడ్ (Oily food)తినడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా వాలెంటైన్స్ రోజు (Valentine's day)న మీ ఫేస్ అందంగా మెరవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
కొద్దిగా లెమన్ రసం (lemon juice), బేకింగ్ సోడా (Baking soda), రోస్ వాటర్ (Rose water).. ఈ మూడింటిని మిక్స్ చేసి ఫేస్ కు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరువెచ్చటి వాటర్‌తో కడగండి. అలాగే లవంగాల పొడి(Clove powder)ని గోరువెచ్చని వాటర్ లో కలిసి పింపుల్స్‌పై అప్లై చేసి.. నెక్ట్స్ డే ఫేస్ చల్లటి వాటర్‌తో క్లీన్ చేయండి. వీటితో పాటుగా జాజికాయ పౌడర్ (Nutmeg powder) అండ్ కలబంద (Aloe vera) మిక్స్ చేసి ముఖానికి రాస్తే.. ఫేస్‌లో గ్లో వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.
Also Read..
Valentine's Special: మన భాగ్యనగరం ప్రేమకు చిహ్నమని ఎంతమందికి తెలుసు?
- Tags
- Valentines day






