ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారిని దర్శించుకున్న 7.60 లక్షల మంది భక్తులు

by Kema Shiva Kumar |

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగిశాయి.

ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారిని దర్శించుకున్న 7.60 లక్షల మంది భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగిశాయి. డిసెంబర్‌ 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేవలం 10 రోజుల్లో 7.60 లక్షల మందికి దర్శనాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకోగా తొమ్మిది రోజులకే 7.09 కోట్ల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. గత సంవత్సరం 6.83 లక్షల మందికి 10 రోజుల్లో దర్శనం లభించగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరుకోనుంది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగిన ఈ తొమ్మిది రోజుల్లో హుండీ కానుకలు రూ.36.86 కోట్లు వచ్చాయని టీటీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలతో రూ.37.97 లక్షల ఆదాయం వచ్చింది.

Next Story