ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలి : కోట రామచంద్రారెడ్డి

by Batti.Sumithra |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి అన్నారు.

ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలి : కోట రామచంద్రారెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక హైదరాబాదులో ఎంతోమంది గుమస్తాలుగా పని చేస్తున్నారని, మండలంలో అనేక పరిశ్రమలు ఉన్న స్థానిక యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, బుగ్గ లక్ష్మయ్య, వడ్డేపల్లి యాదగిరి, అలీ, రజనీకాంత్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story