- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉట్నూర్ సర్పంచ్
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

దిశ, ఉట్నూర్: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ తో పాటు వార్డ్ మెంబర్ పందిరి భీమన్నలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నామని సర్పంచ్ అనిత శ్రీనివాస్ పేర్కొన్నారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, పార్టీ నాయకులు ఉన్నారు.






