ప్యాడెడ్ బ్రా యూజ్ చేస్తున్నారా? రోజంతా అలాగే ఉంటే మాత్రం..

by Sujitha Rachapalli |

సాధారణంగా అమ్మాయిలు ఆకర్షణీయంగా కనిపించేందుకు బ్రా వినియోగిస్తుంటారు.

ప్యాడెడ్ బ్రా యూజ్ చేస్తున్నారా? రోజంతా అలాగే ఉంటే మాత్రం..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా అమ్మాయిలు ఆకర్షణీయంగా కనిపించేందుకు బ్రా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్‌లోకి ప్యాడెడ్ బ్రా వచ్చిన తర్వాత దానికి డిమాండ్ బాగా పెరిగింది. దాదాపు 40శాతం మంది ఇలాంటివే యూజ్ చేస్తున్నారని అంచనా. కానీ ఇవి ఫ్రీక్వెంట్‌గా వినియోగిస్తే నష్టాలేమైనా ఉన్నాయా? లాభాల సంగతేంటి? చూద్దాం.

బెనిఫిట్స్ :

బాడీ షేప్ : బ్రెస్ట్ చిన్నగా ఉన్న అమ్మాయిలు వీటిని వాడేందుకు మొగ్గుచూపుతున్నారు. దీని వల్ల మంచి ఫిజికల్ షేప్ కనిపిస్తుంది. అందరిలో ఉన్నప్పుడు అందంగా ఉన్నామనే కాన్ఫిడెన్స్ పెంచుతుంది.

సపోర్ట్ : ఇక బ్రెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి కూడా ఈ ప్యాడెడ్ బ్రా మంచి మద్దతు ఇస్తుంది. ఎక్కువ లావుగా కనిపించకుండా కరెక్ట్ షేప్‌లో ఉన్నట్లు చూపించడంలో హెల్ప్ అవుతుంది. నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తుంది.

డ్రెస్‌ అప్పియరెన్స్ : నిజానికి ప్యాడెడ్ బ్రాలు డ్రెస్‌ను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఎలాంటి దుస్తులైనా సరే చక్కగా యాప్ట్ అయ్యేలా చేస్తాయి.

నెగెటివ్స్ :

బాడీ ఎఫెక్ట్ : ప్యాడెడ్ బ్రా రోజులో ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. చర్మానికి రక్తప్రసరణలో అంతరాయం కలిగి స్కిన్ ప్రాబ్లమ్స్ పెరగొచ్చు.

అధిక ఒత్తిడి : వీటి వల్ల శరీరంపై అధిక ఒత్తిడి కలిగే చాన్స్ ఉంది. ఈ ప్యాడ్స్ బ్రెస్ట్‌పై అధిక బరువు కలిగించి.. అనేక వ్యాధులకు కారణం కావచ్చు. ముఖ్యంగా వీటికి అలవాటు పడిపోయి లేకుండా ఉండటం కొంచెం అసౌకర్యంగా అనిపించొచ్చు.

అనారోగ్యం : ఏ బ్రా అయినా రాత్రి పూట కూడా ధరించడం మంచిది కాదు. దీని వల్ల అధిక వేడి కలిగి అస్వస్థత ఏర్పడుతుంది. వక్షోజాలు సమస్యలు తలెత్తుతాయి. బ్రెస్ట్ భాగంలో వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది. అందుకే తక్కువ సమయం వాడుతూ.. శరీరానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ అవసరమో జాగ్రత్తలు తీసుకోవాలి.

Next Story