స్మార్ట్‌ఫోన్ యూజర్స్.. రోజుకు 5 గంటలు యాప్‌లోనే!

by Disha Web Desk |
స్మార్ట్‌ఫోన్ యూజర్స్.. రోజుకు 5 గంటలు యాప్‌లోనే!
X

దిశ, ఫీచర్స్ : మహమ్మారి కాలం.. ప్రతీ ఒక్కరు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను వర్చువల్ వరల్డ్‌కు మార్చుకునేలా చేసింది. ఆ తర్వాత కరోనా నుంచి ప్రపంచం బయటపడినప్పటికీ సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్స్ మాత్రం మొబైల్‌ బ్రౌజింగ్‌ను వదలడం లేదు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇప్పటికీ వివిధ యాప్‌లలో రోజుకు 4 నుంచి 5 గంటల సమయం గడుపుతున్నారని అనాలిటకల్ ఫర్మ్ డేటా.ఏఐ అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ఇది లాక్‌డౌన్‌తో పోల్చుకుంటే ఎక్కువ సమయమని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం సహా పన్నెండు దేశాల్లో యాప్ వినియోగంలో అనూహ్య పెరుగుదల కొనసాగుతోంది. ఉదాహరణకు, ఆస్ట్రేలియా వాసులు 2020 ప్రారంభంలో యాప్స్ కోసం రోజుకు సగటున 3.6 గంటలు వెచ్చిస్తే, ప్రస్తుతం ఈ సంఖ్య 40 శాతానికి పెరిగి నేటికి దాదాపు 4.9 గంటలకు చేరుకుంది. అదేవిధంగా, సింగపూర్ కూడా ఇదే విధమైన పెరుగుదలను చూసింది. ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడ ప్రతీ రోజు 4.1 నుంచి 5.7 గంటలపాటు యాప్స్‌లో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, కెనడా వంటి దేశాలు మహమ్మారి ప్రారంభానికి ముందు ఇప్పటికీ వారి సగటులకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుండగా ఇది వారి రోజువారీ జీవితంలో కొనసాగుతున్న యాప్-ఇఫికేషన్‌కు మరింత సాక్ష్యాలను జోడిస్తుంది.

డౌన్‌లోడ్స్ పరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ అగ్రస్థానంలో ఉండగా, కన్య్జూమర్ స్పెండింగ్ విషయంలో టిక్‌టాక్ నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, టిక్‌టాక్, టెలిగ్రామ్, అమెజాన్, ట్విట్టర్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ కంటే ఫేస్‌బుక్ ఇప్పటికీ నెలవారీ క్రియాశీల వినియోగదారుల్లో నంబర్ 1 స్థానంలో ఉంది.

కంప్యూటర్, ఫోన్ స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి ఇప్పటికీ వైద్యనిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా యూసేజ్ విషయంలో ఎవరూ రాజీపడకపోగా, మరింత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో ఇండోనేషియా, సింగపూర్‌ వాసులు ఇప్పటికే 6 గంటల థ్రెషోల్డ్‌కు దగ్గరగా ఉన్నందున, ఇతర దేశాల ప్రజలు కూడా ఆ బాట పడుతుండటంలో ఊహించిన పరిణామమే అంటున్నారు నిపుణులు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed