గడ్డకట్టే చలిలో చెర్రీ ఫ్యాన్స్ ఫీట్.. జక్కన్న ఫిదా..!

by Disha Web |
గడ్డకట్టే చలిలో చెర్రీ ఫ్యాన్స్ ఫీట్.. జక్కన్న ఫిదా..!
X

దిశ, సినిమా : 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌‌గా వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ప్రమోషన్స్ తర్వాత కూడా వాయిదా పడిన సినిమా.. ఫైనల్‌గా మార్చి 25న రిలీజ్ కాబోతోంది. తారక్, చరణ్ మల్టీస్టారర్ మూవీ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మెప్పించగా.. జక్కన్న దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న మూవీకి కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఆల్ ది బెస్ట్ చెబుతూ తమ ప్రేమను చాటుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. -11°c చలి, 30mph ఈదురుగాలుల నడుమ యూఎస్‌ఎ ఫ్యాన్స్ యూనిక్‌గా విషెస్ అందించారు. అక్కడ గ్యాదర్ అయిన 15కుపైగా కుటుంబాలు ఈ ఫీట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయారు. కాగా ఈ అవధులు లేని అభిమానానికి థాంక్స్ చెప్పింది 'ఆర్ఆర్ఆర్' టీమ్.

Next Story

Most Viewed