- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్మూజ్ ను దాటిన అమెరికా యుద్ధ నౌకలు
శనివారం అమెరికా యుద్ధ నౌకలు హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.

Strait of Hormuz
దిశ, వెబ్ డెస్క్ : శనివారం అమెరికా యుద్ధ నౌకలు హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. అయితే ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, హర్మూజ్ జలసంధిని అమెరికా యుద్ధ నౌకలు దాటడం ఇదే మొదటిసారి కావడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా, అమెరికా నావికా దళానికి చెందిన రెండు ఆర్లే బర్క్-క్లాస్ గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లు..USS ఫ్రాంక్ E. పీటర్సన్ మరియు USS మైఖేల్ మర్ఫీ ఈ జలసంధి గుండా ప్రయాణించాయి. అరేబియన్ సముద్రం నుండి పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్ళిన ఈ నౌకలు, తిరిగి వెనుదిరగడం ద్వారా తమ ఉనికిని, ఆధిపత్యాన్ని స్పష్టం చేశాయి. పెంటగాన్, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దీనిని 'ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్' (Freedom of Navigation) ఆపరేషన్‌గా పేర్కొన్నాయి. దీనికి ఇరాన్ అనుమతి తీసుకోక పోవడం గమనార్హం.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ గతంలో వేసిన సముద్ర మైన్లను (sea mines) తొలగించి, వాణిజ్య నౌకల రాకపోకలను సుగమం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యం అని అమెరికా పేర్కొంది. రాబోయే రోజుల్లో అండర్‌వాటర్ డ్రోన్లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలతో ఈ క్లియరెన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ.. "మేము హర్మూజ్ జలసంధిని క్లియర్ చేయడం ప్రారంభించాం, ఇది ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు ఇది మేలు చేస్తుంది" అని వ్యాఖ్యానించారు.
అయితే అమెరికా చర్యపై ఇరాన్ నుండి ఈ పరిణామంపై భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. అధికారిక ఇరాన్ మీడియా అమెరికా నౌకలు జలసంధిని దాటలేదని ఖండించగా, కొన్ని వర్గాలు మాత్రం తాము హెచ్చరికలు పంపామని ఆరోపించాయి. అయితే, అమెరికా ఈ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి ప్రాంతం ఇప్పటికీ అత్యంత ఉద్రిక్తమైన 'టెన్షన్ పాయింట్'గా కొనసాగుతోంది.






