భారత్‌పై ఒత్తిడి తేవాలని ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ

by Malleboina Mahesh |

అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి అవుతున్న పప్పు దినుసులపై భారత్ విధిస్తున్న 30 శాతం టారిఫ్‌ను విదిస్తున్న విషయం తెలిసిందే.

భారత్‌పై ఒత్తిడి తేవాలని ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి అవుతున్న పప్పు దినుసులపై భారత్ విధిస్తున్న 30 శాతం టారిఫ్‌ను విదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ 30 శాతం టారిఫ్ లను తొలగించేలా ఒత్తిడి తేవాలని కోరుతూ అమెరికన్ సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ముఖ్యంగా నార్త్ డకోటా సెనేటర్ కెవిన్ క్రామర్, మొంటానా సెనేటర్ స్టీవ్ డైనెస్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 30న అమెరికన్ ఎల్లో పీస్ (బటానీలు/పప్పు) ఎగుమతులపై భారత్ హఠాత్తుగా 30 శాతం సుంకాన్ని విధించిందని, దీనివల్ల అమెరికా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వారు తమ లేఖలో ప్రస్తావించారు.

భారత్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, అమెరికన్ వస్తువులకు భారత మార్కెట్‌లో మెరుగైన ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ట్రంప్‌ను సెనేటర్లు కోరారు. ఈ టారిఫ్‌ల విధింపు వల్ల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని, వీటిని వెంటనే తొలగించేలా భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. అగ్రరాజ్యం నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ పెద్ద మార్కెట్ అయిన నేపథ్యంలో, ఈ సుంకాల వ్యవహారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య కీలక చర్చాంశంగా మారింది.

Next Story