FIFA వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా

by velandi.Saikiran |

ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి ఫైనల్ కు చేరింది.

FIFA వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి ఫైనల్ కు చేరింది. సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టుపై 2-1 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట 1-0 తేడాతో వెనుకబడిన అర్జెంటీనా, చివరలో ఆటను తమ వైపు మలుచుకుంది. ఇక 7 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి... ఇంగ్లాండ్ పై సూపర్ విక్టరీ అందుకుంది అర్జెంటీనా. అటు మెస్సీ అందించిన రెండు అసిస్ట్ లను ఫెర్నాండెజ్, మార్టినెజ్ గోల్స్ గా మలిచారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 20వ తేదీన అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్స్ ఉండనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఎర్లీ మార్నింగ్ 12:30 గంటలకు షురూ అవుతుంది. కాగా, న్యూ జెర్సీలోని ప్రసిద్ధ న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Next Story