కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కామాంధులు

by velandi.Saikiran |   (  Updated:2026-07-15 22:31:05  IST  )

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కామాంధులు రెచ్చిపోతున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కామాంధులు
X

దిశ కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆఫీసులో పనిచేసే ఓ మహిళ ఉద్యోగిని కామ కోరిక తీర్చాలంటూ వేధించడం వివాదాస్పదంగా మారింది. ఎవరికి చెప్పుకోలేక వారి కోరిక తీర్చలేక మనో వేదనకు గురైతున్న మహిళ పట్ల కామాంధుల చేష్టలు శృతిమించాయి. విధులు నిర్వహిస్తున్న దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలతో వేధింపులు తీవ్రం కావడంతో సదరు మహిళ తోటి మహిళ ఉద్యోగుల వద్ద బోరున విలపించి ఆమె బాధను వెల్లగక్కింది. దీంతో కార్పొరేషన్ లో కామాంధుల కథ వెలుగు చూసి నగరపాలక సంస్థలో నయా ట్రెండ్ నడుస్తుంది అనే చర్చ జోరందుకుంది.

న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా పోరాటం

లైంగిక వేధింపులకు గురౌతున్న కార్పొరేషన్ ఉద్యోగిని తన తోటి ఉద్యోగుల ముందు తన బాధ చెప్పుకోగా ముందు కార్పొరేషన్ బాస్ కు ఫిర్యాదు చేయాలని సలహా ఇవ్వగా వారి సలహా మేరకు సదరు బాధితురాలు కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో సదరు మహిళా ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా న్యాయ పోరాటం చేయడం తో కరీంనగర్ జిల్లా కామాంధుల కథ తెరపైకి వచ్చి చర్చానీయంశంగా మారింది. మహిళా ఉద్యోగుల వినూత్న పోరాటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ మద్దతు పలుకుతున్నారు. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

కార్పోరేషన్ లో కలకలం

కరీంనగర్ నగర పాలక సంస్థలో మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా ఉంటారు. నిత్యం వందలాది మంది మహిళలు కార్పొరేషన్ కు వివిధ పనులపై వస్తుంటారు. సదరు కామాంధులు నగరపాలక సంస్థలో కీలక డిపార్టుమెంట్​లో ఆపరేటర్స్ గా పనిచేయడం, అక్కడికి వివిద విభాగాలకు చెందిన మహిళ ఉద్యోగులతో పాటు నగర పౌరులు, మహిళలు వస్తుంటారు. తాజాగా కామాంధుల అంశం తెరపైకి రావడం కరీంనగర్ కార్పొరేషన్ లో కలకలం సృష్టించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థలో హాట్​టాఫిక్ గా మారి ఎవరా కామాంధులు అని ఆరా తీయడం.. అసలు ఏం జరిగింది అనే చర్చ జరుగుతుంది.

Next Story