పాకిస్తాన్‌పై ఇండియా మిస్సైల్.. స్పందించిన యూఎస్

by Disha Web |
పాకిస్తాన్‌పై ఇండియా మిస్సైల్.. స్పందించిన యూఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌పై ఇటీవల భారత మిసైల్ పడిన విషయం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఓ పక్క రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మరో పక్క పాక్‌పై భారత్ మిస్సైల్ పడటం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. భారత్ కూడా యుద్ధానికి తెరలేపుతుందా అన్న సందేహాలు వచ్చాయి. అయితే ఆ మిస్సైల్ ప్రమాదవశాత్తు పడిందని ఇప్పటికే ఇండియా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ విషయంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ మిస్సైల్ లాంచ్ కేవలం ప్రమాదవశాత్తు జరిగిందని ఇప్పటికే భారతీయలు తెలిపారు. 'ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే, మరెటువంటి ఉద్దేశం లేదని మా భారతీయ భాగస్వాములు తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను కోరవచ్చు. దీనిపై మేము ఇంక చెప్పేదేమీ లేదు' అని యూఎస్ పేర్కొంది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed