- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడిల్ ఈస్ట్ లో ఎత్తైన వంతెనపై అమెరికా-ఇజ్రాయెల్ దాడి
గురువారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని అత్యంత కీలకమైన B1 వంతెన పాక్షికంగా ధ్వంసమైంది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని అత్యంత కీలకమైన B1 వంతెన (B1 Bridge) పాక్షికంగా ధ్వంసమైంది. కరాజ్(Karaj) నగరం సమీపంలో ఉన్న ఈ వంతెన, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను కరాజ్‌తో కలిపే ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రారంభించబడిన ఈ వంతెన, మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనలలో ఒకటిగా గుర్తింపు పొందింది. రెండు దశల్లో జరిగిన ఈ దాడి వల్ల వంతెనలోని ఒక ప్రధాన భాగం కూలిపోవడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మొదటి దాడి జరిగిన గంట వ్యవధిలోనే రెండోసారి బాంబుల వర్షం కురిపించడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది. ఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వం "అమెరికా-జియోనిస్ట్ శత్రువుల" దుశ్చర్యగా అభివర్ణించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని ధృవీకరిస్తూ, "ఇరాన్ అతిపెద్ద వంతెన కూలిపోయింది.. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది" అంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడి వల్ల టెహ్రాన్–కరాజ్ మధ్య సరుకు రవాణా మరియు ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.






