US, భారత్ డీల్ 99 శాతం పూర్తి : అమెరికా

by Muthe.Rajitha |   (  Updated:2026-05-30 04:44:06  IST  )

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం 99 శాతం పూర్తి అయిందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.

US, భారత్ డీల్ 99 శాతం పూర్తి : అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఇప్పటికే 99 శాతం పూర్తి అయిందని, కేవలం ఒకే ఒక్క శాతం సాంకేతిక అంశాలు మాత్రమే బాకీ ఉన్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్(US Ambassador Sergio Gore) స్పష్టం చేశారు. ఈ మిగిలిన ప్రక్రియను కూడా కొలిక్కి తెచ్చి, రాబోయే కొన్ని వారాల్లోనే అధికారికంగా సంతకాలు చేసేందుకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ 1 నుండి 4 మధ్య అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం (US Delegation) ఢిల్లీకి చేరుకుని తుది విడత చర్చలు జరపనుంది. ఇది 2026 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య కుదిరిన ఇంటెరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా కొనసాగనుంది.

ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 25% నుండి 18%కి తగ్గించనున్నారు. AI, సెమీ కండక్టర్స్, క్వాంటం కంప్యూటింగ్,స్పేస్, ఫార్మా, ఐటీ సేవల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం, వాణిజ్యం మరింత బలపడుతుందని ఆశిస్తున్నారు. భారతదేశం కూడా అమెరికా నుండి వచ్చే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించి, తమ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వనుంది. పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అయితే, 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులను భారత్ కొనుగోలు చేయాలనే లక్ష్యంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇది ఒక తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంగా ప్రారంభమయినప్పటికీ, భవిష్యత్తులో ఇది పూర్తి స్థాయి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(BTA) గా మారడానికి పునాది వేయనుంది.

అక్రమ వలస దారులపై అమెరికా "ఏలియన్స్" వెబ్సైట్

Next Story