అమెరికా ఓటమిని ఒప్పుకుంది : ఇరాన్ ప్రకటన

by Muthe.Rajitha |

పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంలో అమెరికా వెనక్కి తగ్గి, ఓటమిని అంగీకరించిందని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అమెరికా ఓటమిని ఒప్పుకుంది : ఇరాన్ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా తన పట్టువిడిచి వెనక్కి తగ్గి, ఓటమిని అంగీకరించిందని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు, ఇరు దేశాల మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని ఇరాన్ తన విజయంగా అభివర్ణిస్తోంది. అమెరికా తన అల్టిమేటంను అమలు చేయలేకపోయిందని, ఇరాన్ ప్రతిఘటన ముందు అగ్రరాజ్యం ఓటమిని ఒప్పుకుందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు, హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అమెరికాకు 10 షరతులు విధించింది.

ఈ షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "సూత్రప్రాయంగా" సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, యురేనియం సుసంపన్నత విషయంలో మాత్రం అమెరికా కొన్ని కఠిన నిబంధనలను విధిస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న 60% పైబడిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ ఏజెన్సీలకు అప్పగించాలని, అణు కేంద్రాలను పూర్తిగా పర్యవేక్షించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. కాగా పాకిస్థాన్ ప్రధాని మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం రెండు వారాల పాటు దాడులను నిలిపివేయడానికి ట్రంప్ అంగీకరించిన సంగతి తెలిసిందే.

Next Story