- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రోజుల్లో యూరియా యాప్ ప్రారంభం: జిల్లా వ్యవసాయ అధికారి
రైతులకు పారదర్శకంగా ఎరువులను విక్రయించేందుకు రెండు రోజుల్లో ఫర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్ తెలిపారు.

దిశ, హాలియా: రైతులకు పారదర్శకంగా ఎరువులను విక్రయించేందుకు రెండు రోజుల్లో ఫర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్ తెలిపారు. గురువారం హాలియా పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియాను అందించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత సీజన్లో వ్యాపారులు ఎమ్మార్పీ ధరలకు ఎరువులు విక్రయించాలని పెంచి అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విక్రయాల్లో ఎరువుల నియంత్రణ, విత్తన చట్టాలకు లోబడి విక్రయాలు జరపాలని సూచించారు. యూరియా కంపెనీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ఎరువులను పురుగు మందుల కంపెనీల ప్రొడక్ట్స్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట నకిరేకల్ ఏడీఏ విజయేందర్ రెడ్డి ఏవో వెంకన్న తదితరులు ఉన్నారు.






