- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడిపై హిజ్రాలు కత్తులతో దాడి.. కలకలం
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హిజ్రాలు కత్తులతో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హిజ్రాలు కత్తులతో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని కొందరు హిజ్రాలు అడ్డగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై యువకుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం అనంతరం హిజ్రాలతో పాటు ఉన్న మరికొందరు వ్యక్తులు యువకుడిపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో యువకుడికి భుజం, చేతిపై గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకునేందుకు యువకుడు పరుగెత్తగా, కొంతదూరం వెంబడించిన దుండగుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.






